తెలంగాణ పోలీసుల కృషి.. సాయి పల్లవి ఫిదా

Published : Feb 20, 2020, 02:02 PM IST
తెలంగాణ పోలీసుల కృషి.. సాయి పల్లవి ఫిదా

సారాంశం

మహిళల కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత ఎక్కడా లేదని పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు.   

మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషికి సినీ నటి సాయి పల్లవి ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.  

ఈ రోజు హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో షీ ఎంపర్ ఉమెన్స్  కాంక్లేవ్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సినీ నటటి సాయి పల్లవి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో పాటు పలువురుు ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read నాగ చైతన్య పై రౌడీ బేబీ రొమాంటిక్ ఎటాక్!

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ... మహిళల కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత ఎక్కడా లేదని పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. 

సిటీకి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే యువతులు గతంలో చాలా భయపడేవారని అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని యువతకు సాయిపల్లవి సూచించారు. కాగా సాయి పల్లవి ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పలు సినిమాల్లో నటించి తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న  ఆమె ప్రస్తుతం శేఖర్ కమ్ములా దర్శకత్వంలో నాగచైతన్యకు జంటగా లవ్ స్టోరీ అనే ప్రేమ కథలో నటిస్తున్నారు. ఇటీవల విడదల చేసిన ఈ సినిమా సాంగ్ టీచర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu