టీఆర్ఎస్ లోకి సినీనటి జయసుధ..కేటీఆర్ ఫోన్

By ramya neerukondaFirst Published Sep 13, 2018, 11:22 AM IST
Highlights

ఆ తర్వాత రాజకీ యాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యేగా ప్రజల్లో  మంచిపేరు సంపాదించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా విని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించేవారని,గర్వం ఏ మాత్రం లేదనే పేరుంది. 

సహజనటి జయసుధ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారా..? అవుననే వార్తలే ఎక్కువగా వినపడుతున్నాయి. ఆమెను టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా పార్టీ అధినేతలే స్వయంగా ఆహ్వానించారు.రాష్ట్ర మంత్రి కె తారకరామారావు ఇటీవల ఆమెకు స్వయంగా ఫోన్ చేసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. 

కేటీఆర్ ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని జయసుధ చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జయసుధ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు.  ఆ తర్వాత రాజకీ యాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యేగా ప్రజల్లో  మంచిపేరు సంపాదించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా విని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించేవారని,గర్వం ఏ మాత్రం లేదనే పేరుంది. 

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటే  పార్టీకి కొంత ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనతో టీఆర్‌ఎస్ లో చేరాలని కేటీఆర్ ఆహ్వానించినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువెళుతున్నారని అమె కితాబిచ్చారు.

click me!