నిందితుడికి కరోనా, ఆసుపత్రికి తరలింపు: హైద్రాబాద్ పోలీసుల్లో టెన్షన్

By narsimha lode  |  First Published Aug 7, 2020, 10:16 AM IST

ఓ కేసులో అరెస్టైన నిందితుడికి కరోనా సోకడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఈ ఘటన హైద్రాబాద్ పాతబస్తీలో చోటు చేసుకొంది.
 


హైదరాబాద్: ఓ కేసులో అరెస్టైన నిందితుడికి కరోనా సోకడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఈ ఘటన హైద్రాబాద్ పాతబస్తీలో చోటు చేసుకొంది.

హైద్రాబాద్  పహాడీ షరీప్ పోలీస్ స్టేషన్  పరిధిలోని తుక్కుగూడలోని ఓ స్థలంలో దుకాణ యజమాని .. తన దుకాణంలో అద్దెకు ఉంటున్న వ్యక్తితో గొడవకు దిగాడు. దుకాణం ఖాళీ చేయడం లేదని పాతబస్తీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తిపై  షాపు యజమాని ఫిర్యాదు చేశారు. 

Latest Videos

undefined

దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. గురువారం నాడు అతడిని రిమాండ్ కు తరలించే సమయంలో నిందితుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు . ఈ పరీక్షల్లో నిందితుడికి కరోనా ఉన్నట్టుగా తేలింది. ఈ విషయం తెలియడంతొ నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు విచారించిన పోలీసుల్లో కలవరం మొదలైంది. 

నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో వైపు పోలీస్ స్టేషన్ మొత్తం శానిటేషన్ చేశారు. పోలీసులు కూడ కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు సిద్దమయ్యారు.

click me!