
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) వివిధ యూనివర్సిటీల్లో సీనియర్, జూనియర్ అసింటెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
రెండు యూనివర్సిటీల్లో కలిపి మొత్తం 127 పోస్టులను భర్తీ చేయనున్నారు. వెటర్నటీ యూనివర్సీటీలో సీనియర్ అసిస్టెంట్ 15, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 10 పోస్టులు, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 102 పోస్టులను టీఎస్ పిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు.
read more స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి..
డిగ్రీతో పాటు డిప్లోమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్ ఆప్ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ లో ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉత్తీర్ణులైన వారికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా టీఎస్ పిఎస్సి తేల్చింది. అంతేకాకుండా జనరల్ అభ్యర్థులకు 18నుండి 34 ఏళ్ల వయసును నిర్దారించగా బిసి,ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు పదేళ్లు మినహాయింపును ఇచ్చింది.