వాహనదారులకు షాక్... ఇక వెనక కూర్చున్నా హెల్మెట్ తప్పనిసరి

Published : Feb 03, 2020, 10:23 AM IST
వాహనదారులకు షాక్... ఇక వెనక కూర్చున్నా హెల్మెట్ తప్పనిసరి

సారాంశం

ప్రతియేటా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది మంది దుర్మరణం చెందడంతోపాటు లక్షలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదంలో ఇంటి పెద్దలను, ప్రదాన సంపాదనపరులను పోగొట్టుకున్న కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 

హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా మారనున్నాయి. ఇప్పటికే కేంద్రం తీసుకువచ్చిన నూతన వాహన చట్టంతో.. చాలా మందిలో మార్పు వచ్చింది. ఏ ట్రాఫిక్ రూల్ పాటించకుంటే ఎంత జరిమానా పడుతుందా అనే భయంతో జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే.. ఇప్పుడు మరో రూల్ తీసుకువచ్చారు.

ఇప్పటి వరకు ద్విచక్రవాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇక నుంచి వెనక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇద్దరూ కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెబుతున్నారు. లేదంటే జరిమానా చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Also Read చిచ్చర పిడుగు..నడిరోడ్డుపై మేనమమామకు చుక్కలు చూపించి...

ప్రతియేటా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది మంది దుర్మరణం చెందడంతోపాటు లక్షలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదంలో ఇంటి పెద్దలను, ప్రదాన సంపాదనపరులను పోగొట్టుకున్న కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. లక్షలాది మంది దివ్యాంగులుగా మారుతున్నారు. 

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న ద్విచక్ర వాహనదారుల్లో 70 శాతం మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలవడం వల్ల మరణిస్తున్నారు. బైక్‌ నడిపే వ్యక్తి హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో వెనకాల కూర్చున్న వారే మృతి చెందుతున్నారు.వాటిని నివారించేందుకే పోలీసులు ఈ రకం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?