జీతాల్లేకుంటే చచ్చిపోతారా...? సోమారపు వివాదాస్పద వ్యాఖ్య

First Published Jul 20, 2018, 6:00 PM IST
Highlights

ఇటీవలే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలు జీతాలు ఆలస్యమైనంత మాత్రాన చచ్చిపోతారా? అంటూ ఉద్యోగులను ప్రశ్నించారు. రూ.700 కోట్ల నష్టాల్లో ఆర్టీసిని నడుపుతున్నామని  ఎవరూ ప్రెస్టేజియస్ గా ఫీల్ కావద్దని ఆయన సూచించారు.
 
అయితే ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ ఛైర్మన్ పదవితో సంతృప్తిగానే ఉన్నానని సోమారపు సత్యనారాయణ తెలిపారు. అయితే ఆర్టీసిని తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కృషి చేస్తున్నామని అన్నారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం నిధులు ఇవ్వనపుడు మాత్రం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నామని సోమారపు తెలిపారు.

 ఆర్టీసీ ఆస్తుల విభజనకు ఏపీ ముందుకు రావడం లేదని సోమారపు అన్నారు. ఆస్తుల విభజన అనగానే ఏపీ అధికారులు పారిపోతున్నారని తెలిపారు. తెలంగాణ ఆస్తులపై ఏపీ వారికి ఎలాంటి హక్కు లేదని, బస్ భవన్ పై ఏపీఎస్ ఆర్టీసికి 52 శాతం మాత్రమే హక్కుందని అన్నారు.

ఆర్టీసీ సంస్థలో కార్మికుల జీతాలు పెరగాల్సిన అవసరం ఉందని సోమారపు అన్నారు.  ఉద్యోగాలు తక్కువ జీతాలకే ఎక్కువ పని చేస్తున్నారని, ఛైర్మన్ గా వారికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. 
 
ఆర్టీసికి ఆటోలు కూడా కాంపిటీషన్ గా మారాయని ఆయన అన్నారు. మిగతా వాళ్లలా రేట్లు పెంచుకోలేకే ఆర్టీసీ నష్టాలు చవిచూస్తుందన్నారు. అలాగే ఆర్టీసీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ  చేయిస్తున్నానని సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు.

click me!