హోటల్లో ఏసీబీకి చిక్కిన జిహెచ్ఎంసీ మహీళా డీఈ: అరెస్టుకు రంగం సిద్ధం

By telugu teamFirst Published May 31, 2021, 10:56 AM IST
Highlights

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసీ డీఈ మహాలక్ష్మి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి స్వీపర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు.

హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మిని అవినీతి నిరోధక శాఖ ((ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. స్పీపర్ నుంచి లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు 

ఇటీవల జిహెచ్ఎంసీ మహిలా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో  మరమించారు. ఆమె ఉద్యోగం భర్తకు ఇప్పించేందుకు మహాలక్ష్మి లంచం అడిగారు. మల్లాపూర్ లోని ఓ హోటల్ లో రూ. 20 వేలు తసుకుంటూ ఆమె ఏసీబీకి చిక్కారు. 

ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కార్యాలయంలోనూ మల్లాపూర్ లోని ఆమె నివాసంలోనూ ఏసీబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగదు, బంగారం తమకు లభించిందని ఏసీబీ డిఎస్పీ సూర్యానారాయణ చెప్పారు. సోదాల తర్వాత మహాలక్ష్మిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడుతామని ఆయన చెప్పారు. 

click me!