మహిళపై బురిడీ బాబాల అత్యాచారం.. వీడియోతీసి బ్లాక్ మెయిల్, పోలీసుల సస్పెన్షన్.. !

Published : May 31, 2021, 10:37 AM IST
మహిళపై బురిడీ బాబాల అత్యాచారం.. వీడియోతీసి బ్లాక్ మెయిల్, పోలీసుల సస్పెన్షన్.. !

సారాంశం

యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పూజలపేరుతో మోసం చేయడమే కాకుండా, ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి... దాన్ని వీడియో తీసి మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పూజలపేరుతో మోసం చేయడమే కాకుండా, ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి... దాన్ని వీడియో తీసి మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

జిల్లాలోని రామన్న పేట మండలం మునిపంపులలో పూజల పేరుతో బురిడీ బాబాలు ఓ మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల గొడవల్లో బురిడీ బాబాలు తలదూర్చారు. పూజల పేరుతో ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దాన్నంతా వీడియో తీశారు. 

ఆ తరువాత ఈ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా నగదు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీడియోలు డిలీట్ చేయించి బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు వాపస్ ఇప్పించారు. 

మిగతా డబ్బు ఇవ్వకపోవడంతో రాచకొండ సీపీని బాధితురాలు ఆశ్రయించింది.  సీపీ విచారణలో పోలీసుల, బాబాల బాగోతం వెలుగుచూసింది. కేసులో నిర్లక్ష్యం వహించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు రావడంతో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ లను సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?