రూ.50 కోట్లపైగా అక్రమ ఆస్తులు: సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ అరెస్ట్

Siva Kodati |  
Published : Dec 19, 2019, 07:14 PM IST
రూ.50 కోట్లపైగా అక్రమ ఆస్తులు: సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ అరెస్ట్

సారాంశం

అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీ వలలో చిక్కిన సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్టయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఆయన నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు

అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీ వలలో చిక్కిన సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్టయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఆయన నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో భారీగా నగదుతో పాటు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సిద్ధిపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్‌లో ఏసీబీ రెండ్రోజులుగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు రూ.5 కోట్లకు సంబంధించిన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

Also ReadESI Scam: విస్తుపోయే దేవికారాణి ఆస్తులు: అమరావతినీ వదల్లేదు

కిలోన్నర బంగారం, గోల్కొండలో విల్లా, శంకర్‌పల్లిలో 14 ఫ్లాట్లు, సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌లో 20 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

Also Read:అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు

నర్సింహారెడ్డి కొద్దిరోజుల క్రితమే డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందారు. ఆయనపై ఎన్నో రోజుల నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఏసీబీ అధికారులు నిఘా పెట్టి, సోదాలకు దిగారు. 
 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu