ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

By narsimha lode  |  First Published Apr 22, 2019, 11:11 AM IST

అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన  చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయానికి తాళం వేశారు.
 


హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన  చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయానికి తాళం వేశారు.

ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ఎబివీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులను, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Videos

undefined

ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. పరీక్షల్లో ఫెయిలైనట్టుగా ఇప్పటికే 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్‌, మంత్రి జగదీష్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని  విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఇంటర్ బోర్డు నిర్వాకంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో విద్యార్థుల తల్లిదండ్రులకు స్థానం కల్పించాలని  విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు విద్యార్థి సంఘాల ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడ పాల్గొన్నారు. ఉచితంగా రీవాల్యూయేషన్‌ నిర్వహించాలని ఆయన కోరారు. విద్యార్థుల ఆందోళనతో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల ఆందోళనతో భారీగా పోలీసులను మోహరించారు.
 

click me!