శ్రీలంకలో పేలుళ్లు.. హైదరాబాద్‌లో హైఅలర్ట్

By Siva KodatiFirst Published Apr 22, 2019, 10:17 AM IST
Highlights

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడటంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు ఒక రోజు ముందే నగరంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడటంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు ఒక రోజు ముందే నగరంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో ఢిల్లీకి చెందిన పోలీస్ బృందం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించింది. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్ధుల్ బాసిత్ సిరియా, టర్కీ, ఆఫ్గనిస్తాన్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఎన్ఐఏ చేతికి చిక్కాడు.

ఇతడికి ఐసిస్ సానుభూతిపారులు ఆర్ధిక సహకారం అందించినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో శ్రీలంకలో పేలుళ్లు చోటు చేసుకోవడం హైదరాబాద్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. 
 

click me!