అభయ హస్తం దరఖాస్తును ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ లింక్ ద్వారా ఈ అప్లికేషన్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Application Form: తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ప్రజా పాలన మొదలైంది. నేటి నుంచి గ్రామాల్లో అప్లికేషన్లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. ఈ ప్రజా పాలనకు విశేష ఆదరణ వచ్చింది. పెద్ద మొత్తంలో ప్రజలు లైన్లు కట్టి ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, చేయూత, ఇతర పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల ప్రజా పాలన మొదలైన మూడు నాలుగు గంటల్లోనే దరఖాస్తు ఫామ్‌లు అయిపోయాయి.
పలు చోట్ల దరఖాస్తు ఫారాలను ప్రింట్ తీసి లేదా.. జిరాక్స్ తీసి డబ్బులు దండుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అభయ హస్తం ఒక్కో దరఖాస్తు ఫామ్‌ను రూ. 50 నుంచి రూ. 80 వరకు అమ్ముకున్నారు. దీంతో దళారులు అంటూ వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారుల రాజ్యమేనన్న బీఆర్ఎస్ ఆరోపణలను చర్చించుకున్నారు.
Also Read: Amit Shah: ఈటల రాజేందర్ ముందు గడ్డుకాలం.. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో..!
ఈ దరఖాస్తు ఫామ్‌లు ఉచితంగా అందిస్తారని, వీటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదని అధికారలు ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో వీటిని ఉచితంగా అందిస్తున్నారనీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దరఖాస్తు ఫామ్‌లను ఫోన్‌లోనూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఈ లింక్ (https://drive.google.com/file/d/1Wc9Eeo83xj3Cyp2LZjQrmKS4c1XI-WQq/view) ద్వారా అభయ హస్తం దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.