అబ్దుల్లాపూర్‌‌మెట్ మృతదేహాల కేసు.. బయటికి వెళ్లాడంటే వచ్చేది మర్నాడే, జ్యోతి ఎవరో తెలియదు : మృతుడి సోదరుడు

Siva Kodati |  
Published : May 03, 2022, 05:40 PM ISTUpdated : May 03, 2022, 07:09 PM IST
అబ్దుల్లాపూర్‌‌మెట్ మృతదేహాల కేసు.. బయటికి వెళ్లాడంటే వచ్చేది మర్నాడే, జ్యోతి ఎవరో తెలియదు : మృతుడి సోదరుడు

సారాంశం

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో వెలుగుచూసిన జంట మృతదేహాల కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.   

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ (abdullapurmet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో యువతీ, యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. దుర్వాసన వస్తుండటంతో అక్కడికి వెళ్లి చూసిన స్థానికులకు డెడ్ బాడీలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతీ, యువకుల మృతదేహాలు నగ్నంగా పడివుండగా.. యువతీ మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా వుంది. హత్య చేసి తగుల బెట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. యువకుడి పేరు యశ్వంత్‌గా, యువతి పేరు జ్యోతిగా గుర్తించారు. వీరిద్దరూ ఏకాంతంగా వున్న సమయంలో ఎవరో హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి... హైదరాబాద్‌ సెంట్రల్‌లో షాపింగ్ చేసింది జ్యోతి (jyothi). ఆమె బ్యాగులో వున్న షాపింగ్ బిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బిల్స్‌ను శ్రీనివాసే చెల్లించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్‌ను (srinivas) పోలీసులు ప్రశ్నించగా.. జ్యోతి తన స్నేహితురాలిని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు యువతీ, యువకులు బైక్‌పై వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ రోజే వీరిని హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఇంటి నుంచి వెళ్లిన యశ్వంత్ ఇప్పుడు విగతజీవిగా కనిపించాడు అంటున్నాడు అతని సోదరుడు. యశ్వంత్ (yeshwanth) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడని చెబుతున్నాడు. మృతి చెందిన యువతి జ్యోతి గురించి తనకు ఏమి తెలియదని.. ఎవరు చంపారో కూడా తెలియదని యశ్వంత్ సోదరుడు అంటున్నాడు. నీరజ్ అనే వ్యక్తి యశ్వంత్‌తో తరచూ గొడవ పడేవాడని తెలిపాడు. ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా మరుసటి రోజు వస్తుండేవాడని.. అలాగే తిరిగి వస్తాడని భావించామని చెప్పాడు. ఈ ఉదయం పోలీసులు ఫోన్ చేస్తేనే యశ్వంత్ చనిపోయినట్లు తెలిసిందని అతను పేర్కొన్నాడు. 

మరోవైపు యశ్వంత్ - జ్యోతిలది హత్యగానే భావిస్తున్నామన్నారు డీసీపీ. జ్యోతికి ఇప్పటికే వివాహం జరిగిందని.. ఇద్దరు పిల్లలని తెలిపారు. ఆమె భర్తను విచారించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ చెప్పారు. ఇద్దరూ వారాసి గూడకు చెందినవారేనని ఆయన తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu