కరోనా సోకి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ మృతి

Published : Sep 08, 2020, 11:30 AM ISTUpdated : Sep 08, 2020, 11:31 AM IST
కరోనా సోకి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ మృతి

సారాంశం

అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. పది రోజులపాటు వైద్యానికి స్పందించిన ఆయన శరీరం గత రెండు రోజులుగా సహకరించలేదని వైద్యులు తెలిపారు.  

కరోనా వైరస్ సోకి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఆర్ రాజన్న(56) మృతి చెందారు. గత నెల చివరి వారంలో రాజన్నకు కోవిడ్‌ నిర్ధారణ కావడంతో కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. అయితే.. పరిస్థితి విషమించడంతో.. ఆయనను ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. పది రోజులపాటు వైద్యానికి స్పందించిన ఆయన శరీరం గత రెండు రోజులుగా సహకరించలేదని వైద్యులు తెలిపారు.

కాగా.. ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని చాందా(టి) గ్రామం రాజన్న స్వస్థలం. ఈయన గతంలో ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌రూరల్‌ జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మృతిపై జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. పలువురు నాయకులు బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. స్వగ్రామంలోనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu