Hyderabad: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లేదా ఏఐఎంఐఎంకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దేశంలోని 50 మంది అగ్రనేతలు త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. త్వరలోనే తాము మేనిఫెస్టోను విడుదల చేస్తామనీ, రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
Telangana Congress: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లేదా ఏఐఎంఐఎంకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దేశంలోని 50 మంది అగ్రనేతలు త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. త్వరలోనే తాము మేనిఫెస్టోను విడుదల చేస్తామనీ, రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
వివరాల్లోకెళ్తే.. బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎంలపై తీవ్ర విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ లేదా ఏఐఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన కీలకమైన బిల్లులను ఆమోదించడంలో బీఆర్‌ఎస్ పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, నోట్ల రద్దు, అవిశ్వాస తీర్మానం, సీఏఏ, ఎన్నార్సీ, ట్రిపుల్ తలాక్ బిల్లు ,జీఎస్టీ, బిల్లు మొదలైన వాటిలో బీఆర్‌ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం మిత్రపక్షాలు కాబట్టి అవి బీజేపీతో సమానమని అర్థమవుతోందని ఆయన అన్నారు. ఎంఐఎం 50 లక్షల మంది ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే నాటకం ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా మైనారిటీ కమ్యూనిటీని మోసం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. మైనారిటీ సమాజం ఎలాంటి అభివృద్ధి లేకుండా కొట్టుమిట్టాడుతోందన్నారు.
ఓల్డ్ సిటీలో క్షీణిస్తున్న అక్షరాస్యత రేట్లు, అధిక నిరుద్యోగిత రేట్లు, ప్రాథమిక పౌర సౌకర్యాల కొరత గురించి ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. ఆయా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. "బీఆర్ఎస్, ఎంఐఎంలు నాగ్‌పూర్ (ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న) మీదుగా ఢిల్లీకి చేరుకుంటాయి, అయితే కాంగ్రెస్ మాత్రం నేరుగా ఢిల్లీకి వెళ్తుంది" అని ఆయన చెప్పారు. ఓల్డ్ సిటీ మెట్రో సర్వే కోసం డ్రోన్‌లను ఉపయోగించి దృష్టిని ఆకర్షించారంటూ బీఆర్ఎస్, ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. శుక్రవారం జాహిద్ అలీఖాన్‌ను ఆయన నివాసంలో కలిసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ 'మైనారిటీ డిక్లరేషన్'లో చేర్చే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సూచనలను కూడా కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కాంగ్రెస్ లౌకికవాదం కోసం వాదిస్తుంది, దేశంలోని భిన్నమైన వర్గాలను కలిసి ఉంచడానికి రూపొందించబడింది, దాని మిశ్రమ సంస్కృతి దాని గొప్ప బలమని నమ్ముతుంది. కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ లౌకికవాదంపై గట్టి నమ్మకం కలిగి ఉన్నారని" అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దేశంలోని 50 మంది అగ్రనేతలు త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. తాము మేనిఫెస్టోను విడుదల చేస్తామని, రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దేశంలోని 50 మంది అగ్రనేతలు త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. త్వరలోనే తాము మేనిఫెస్టోను విడుదల చేస్తామనీ, రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.