తెలంగాణలో టీచర్ల బదిలీ ప్రక్రియకు ప్రారంభం.. షెడ్యూల్ ఇదే

Siva Kodati |  
Published : Sep 01, 2023, 10:02 PM IST
తెలంగాణలో టీచర్ల బదిలీ ప్రక్రియకు ప్రారంభం.. షెడ్యూల్ ఇదే

సారాంశం

తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిపై శుక్రవారం విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం వెల్లడించింది. 

తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిపై శుక్రవారం విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. టీచర్ల బదిలీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఈ నెల 6 మరియు 7వ తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి వుంటుంది. అలాగే 8 , 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అధికారులు ప్రకటిస్తారు. తర్వాత 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. 

  • 12, 13 తేదీల్లో సీనియారిటీ జాబితాలను ప్రచురిస్తారు
  • 14వ తేదీన మార్పులు , చేర్పులకు అవకాశం
  • 15న ఆన్‌లైన్ ద్వారా హెడ్‌మాస్టర్ల బదిలీలు
  • 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీల ప్రదర్శన
  • 17, 18, 19 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు
  • 20, 21 తేదీల్లో ఖాళీగా వున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ప్రకటన
  • 21న వెబ్ ఆప్షన్ల ఎంపిక 
  • 22న మార్పులు, చేర్పులకు అవకాశం
  • 23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలు
  • 24న స్కూల్ అసిస్టెంట్ ఖాళీల వెల్లడి
  • 26, 27, 28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి
  • 29, 30, 31 తేదీల్లో ఎస్‌జీటీ ఖాళీల వివరాలు వెల్లడిస్తారు
  • అక్టోబర్ 2న మార్పులు, చేర్పులకు అవకాశం
  • అక్టోబర్ 3న ఎస్‌జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు
  • అక్టోబర్ 5 నుంచి 19 వరకు అప్పీల్‌కు అవకాశం
     

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్