ఈ పోలీసాఫీసర్ ఏం చేసిండో తెలుసా ?

First Published Feb 3, 2018, 5:06 PM IST
Highlights
  • రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రితో చేర్చిన సిఐ
  • వైద్య ఖర్చులను కూడా భరిస్తానని ముందుకొచ్చిన పోలీసు

ఖాకీలంటే కఠినంగా ఉంటారు. ఖాకీలంటే డబ్బులు గుంజుడే పనిగా పెట్టుకుంటారు. ఖాకీలు జనాలను వేధిస్తారు. పీల్చి పిప్పి చేస్తారు. లంచాలు గుంజుతారు.. జనాల్లో పోలీసుల పట్ల ఉన్న అభిప్రాయం ఇది.

కానీ అందరు ఖాకీలు అలాగే ఉంటారా అంటే ఉంటారని మాత్రం చెప్పరు. కొందరు మంచివాళ్లు కూడా ఉంటారని జవాబిస్తారు. అలాంటి మంచి ఖాకీ అధికారి ఈయన. ఈయనేం చేశాడో చదవండి. కింద వీడియో ఉంది చూడండి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన చంద్రయ్య మహేశ్వరి దంపతులతో పాటు వారి ఆరు సంవత్సరాల కుమారుడికి గాయలయ్యాయి. అయితే ఇంటి నుంచి అదే దారిలో వస్తున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిఐ మహేష్ వారి పాలిట దేవుడిలా వచ్చాడు. గాయపడిన దంపతులను తన వాహనంలో ఎక్కించుకుని శంషాబాద్ లోని ప్రవేటు హస్పటల్ కు చిన్నారిని తన చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లాడు.

అంతేకాకుండా వారి చికిత్స కోసం అయ్యే ఖర్చును సైతం భరిస్తానంటూ మానవత్వాని చాటాడు. నిన్నగాక మొన్న పాతబస్తీలో ఒక పాదచారికి గుండెనొప్పి వస్తే అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు క్షణాల్లో స్పందించి ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేశారు. వెంటనే అంబులెన్స్ రప్పించి ఆసుపత్రికి తరలించారు.

ఇలాంటి పోలీసులు ఉన్నరంటే ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలుగుతుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. కారణాలేమైనా.. మంచి పోలీసుల సంఖ్య పెరుగుతున్నట్లు కొడుతున్నది కదా?

click me!