రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణీ మృతి, కడుపులో బిడ్డ ఎగిరి బయటపడి..

By telugu news teamFirst Published Feb 13, 2020, 11:31 AM IST
Highlights

పొట్ట పై నుంచి లారీ టైరు ఎక్కడంతో కడుపులోని శిశువు (మగ శిశువు) 10 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పడింది. కొన ఊపిరితో ఉన్న పసికందును అటువైపుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శిశువు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఆమె నిండు గర్భిణీ... మరో రెండు, మూడు రోజుల్లో ప్రసవం కావాల్సి ఉంది. ముందు జాగ్రత్త కోసం భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు... రెండు, మూడు రోజుల్లో పండంటి పాపాయి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని చెప్పారు. నొప్పులు రాగానే ఆస్పత్రికి రావాలంటూ జాగ్రత్తలు చెప్పి పంపించారు. 

డాక్టర్ చెప్పిన మాటలతో ఆనందంలో ఉన్న ఆ దంపతులు... బైక్ పై ఇంటికి వెళుతుండగా.. తీరని విషాదం వాళ్లని అలుముకుంది. వారి వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. ఆక ఆమె కడుపులో బిడ్డ అయితే.. ఎగిరి బయటపడి.. కన్ను తెరవకుండానే కన్నుమూసింది. ఈ హృదయ విదారక సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read ప్రేమ మోసం.. తట్టుకోలేక యువతి ఆత్మహత్యాయత్నం..

పూర్తి వివరాల్లోకి వెళితే... రామచందర్ రావు బంజర్ గ్రామానికి చెందిన బలుసుపాటి మురళికి గతేడాది వివాహమైంది. అతని భార్య కళ్యాణి(20) 9 నెలల గర్భిణి. కాగా.. భార్య కళ్యాణిని తీసుకొని మురళీ బుధవారం ఉదయం పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లాడు. 9నెలలు నిండాయని.. రెండు, మూడు రోజుల్లో నొప్పులు వచ్చే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్పారు.

దీంతో మురళి తన భార్య కల్యాణిని ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని రామచందర్‌రావుబంజర్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో వారి వాహనాన్ని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. దీంతో.. కళ్యాణికి తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దారుణం ఏమిటంటే... ఆమె కడుపులో ఉన్న బిడ్డ పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి ఎగిరి పడి చనిపోయింది. 

పొట్ట పై నుంచి లారీ టైరు ఎక్కడంతో కడుపులోని శిశువు (మగ శిశువు) 10 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పడింది. కొన ఊపిరితో ఉన్న పసికందును అటువైపుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శిశువు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదం చూసినవారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇక మురళీ, అతని కుటుంబసభ్యులు ఏకధాటిగా రోధించడం గమనార్హం.  ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!