18 గంటలపాటు లాకర్ గదిలో 84 యేళ్ల వృద్ధుడు... జూబ్లీహిల్స్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం...

Published : Mar 29, 2022, 01:56 PM IST
18 గంటలపాటు లాకర్ గదిలో 84 యేళ్ల వృద్ధుడు... జూబ్లీహిల్స్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం...

సారాంశం

బ్యాంకు సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వృద్ధుడు రాత్రంతా ఇబ్బంది పడ్డాడు. లాకర్ రూంలో ఉన్న అతడిని గమనించకుండా బ్యాంక్ టైం అయిపోయిందని చెప్పి తాళాలు వేసుకుని వెళ్లి పోయారు. దీంతో ఆ వృద్ధుడు దాదాపు 18 గంటలపాటు ఆ గదిలో బందీగా ఉన్నాడు. 

జూబ్లీహిల్స్ : bank సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాల మీదికి తెచ్చింది. jublee hills బ్యాంక్ సిబ్బంది నిర్వాకం ఓ వృద్ధుడిని 18 గంటల పాటు బ్యాంకు లాకర్ గదిలో ఉండేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ union bankలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 67 లో 84 ఏళ్ల వ్యాపారి కృష్ణారెడ్డి నివాసముంటున్నారు. ఆయన సోమవారం సాయంత్రం 4.20 గంటలకు ఒక పని మీద జూబ్లీహిల్స్ check postలోని యూనియన్ బ్యాంకుకు వెళ్లారు. 

లాకర్ గదిలోపల కృష్ణారెడ్డి ఉండగానే సిబ్బంది గమనించకుండా దాన్ని మూసివేయడంతో ఆయన రాత్రంతా అందులోనే గడపాల్సి వచ్చింది. రాత్రియినా, ఎంత సేపటికీ కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించగా బ్యాంకు లాకర్ గదిలో కృష్ణారెడ్డి ఉన్నట్టు గుర్తించారు. వృద్ధుడికి మధుమేహం ఉండడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 16న బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంతో ఐఎఫ్ఎల్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు యాజమాన్యం రాజ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాదులోని ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో పలువురు ఖాతాదారులు బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. అయితే బ్యాంకులో సుమారు 14.5 కిలోల బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్ బ్యాంకు నుండి మాయం చేశారు. ఈ బంగారంతో క్రికెట్ బెట్టింగ్ పాల్పడ్డాడు. స్టార్ యాప్ లో రాజ్కుమార్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకు మేనేజర్ రాజ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కాగా, మార్చ్ 24న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకు లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో బ్యాంకు లో మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడంతో చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.

బ్యాంకులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ ఇతర సామాగ్రి ధ్వంసం అయింది. అయితే డబ్బులు, పత్రాలు భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.