
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ నుంచి బండరాయి జారి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులందరినీ చిన్నగూడెం మండలం మంగోరిగూడెనికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీస్ , అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.