తెలంగాణలో అదుపులోకి కరోనా: సెకండ్ వేవ్‌లో తొలిసారిగా వెయ్యి లోపే కేసులు

Siva Kodati |  
Published : Jun 27, 2021, 09:31 PM IST
తెలంగాణలో అదుపులోకి కరోనా: సెకండ్ వేవ్‌లో తొలిసారిగా వెయ్యి లోపే కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా సెకండ్ వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. గత కొన్నినెలల కాలంలో ఎన్నడూ లేనంతగా, వెయ్యికి లోపే రోజువారీ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 81,405 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 748 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

తెలంగాణలో కరోనా సెకండ్ వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. గత కొన్నినెలల కాలంలో ఎన్నడూ లేనంతగా, వెయ్యికి లోపే రోజువారీ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 81,405 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 748 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 121 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

గత 24 గంటల వ్యవధిలో 1,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న నమోదైన కేసులతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 6,20,613కి చేరింది. నేటి వరకు వైరస్ నుంచి 6,02,676 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 14,302 యాక్టివ్ కేసులు వున్నాయి. వైరస్ వల్ల ఇప్పటి వరకు మొత్తం 3,635 మంది మరణించారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.10 శాతానికి చేరుకుంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 42, జీహెచ్ఎంసీ 121, జగిత్యాల 19, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 18, గద్వాల 6, కామారెడ్డి 0, కరీంనగర్ 50, ఖమ్మం 61, ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 16, మహబూబాబాద్ 29, మంచిర్యాల 25, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 36, ములుగు 14, నాగర్ కర్నూల్ 10, నల్గగొండ 34, నారాయణపేట 6, నిర్మల్ 1, నిజామాబాద్ 7, పెద్దపల్లి 21, సిరిసిల్ల 15, రంగారెడ్డి 49, సిద్దిపేట 22, సంగారెడ్డి 24, సూర్యాపేట 44, వికారాబాద్ 8, వనపర్తి 13, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 25, యాదాద్రి భువనగిరిలో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu