రెండు బస్సుల మధ్య ఇరుక్కుని 73యేళ్ల వృద్ధుడు మృతి...

Published : Jun 28, 2021, 09:15 AM IST
రెండు బస్సుల మధ్య ఇరుక్కుని 73యేళ్ల వృద్ధుడు మృతి...

సారాంశం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని రతిఫైల్ బస్ స్టేషన్‌లో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండురెండు టిఎస్‌ఆర్‌టిసి బస్సుల మధ్య ఇరుక్కుని 73 ఏళ్ల వృద్ధుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.  

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని రతిఫైల్ బస్ స్టేషన్‌లో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండురెండు టిఎస్‌ఆర్‌టిసి బస్సుల మధ్య ఇరుక్కుని 73 ఏళ్ల వృద్ధుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.  

నాంపల్లి - సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తున్న బస్సు ముందు డోరునుంచి దిగాడు. రోడ్డుకు అవతలి వైపు వెళ్లడానికి బస్సు ముందునుంచి దాటబోయాడు. అయితే ఆ బస్సు ముందే ఆపి ఉన్న మరో బస్సు... దిల్సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్సు.. బయల్దేరడానికి రివర్స్ తీసుకోవడం ప్రారంభయ్యింది. 

ఆ బస్సు డ్రైవర్ వెనకున్న ప్రసాద్ ను చూసుకోకుండా రివర్స్ చేయడంతో రెండు బస్సులు మధ్య ఇరుక్కుపోయిన ప్రసాద్ గట్టిగా కేకలు వేశాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ముందుకు తీసుకుని ఆపాడు. 

అక్కడే ఉన్న మిగతా వారు ఇది గమనించి వచ్చే చూసేసరికి ప్రసాద్ గాయాలతో పడి ఉన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫోన్ చేశారు. అంబులెన్స్ ను పిలిపించారు. అంబులెన్స్ వచ్చేసరికే ప్రసాద్ మృతి చెందాడు. 

బాధితుడి జేబులో దొరికిన పాన్ కార్డు ఆధారంగా అధికారులు అతడిని గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను గోపాల్‌పురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు  ఐపిసి సెక్షన్ 304-ఎ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమవడం) కింద కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu