తెలంగాణ: యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్

Siva Kodati |  
Published : Dec 24, 2020, 08:32 PM IST
తెలంగాణ: యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్

సారాంశం

యూకే నుంచి తెలంగాణ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 1200 మందిలో 846 మందికి కరోనా పరీక్షలు చేశారు. జగిత్యాల 2, వరంగల్ 1, హైదరాబాద్ 2, మేడ్చల్ 1, సిద్దిపేటలో ఒకరికి కోవిడ్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు.

యూకే నుంచి తెలంగాణ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 1200 మందిలో 846 మందికి కరోనా పరీక్షలు చేశారు.

జగిత్యాల 2, వరంగల్ 1, హైదరాబాద్ 2, మేడ్చల్ 1, సిద్దిపేటలో ఒకరికి కోవిడ్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. రెండవ దశ అనుమానిత పాజిటివ్ కేసులుగా నమోదు చేశారు.

జీన్ మ్యాపింగ్ టెస్టుల కోసం ఏడుగురి శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపారు. రెండు రోజుల్లో జీన్ మ్యాపింగ్ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. దీని ఆధారంగానే ఇది కొత్త స్ట్రెయినా.. లేదంటే పాతదా అనే విషయం తెలియనుంది. 

కాగా అన్ని జిల్లాల్లో యూకే వెళ్లొచ్చిన వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే నుంచి కరీంనగర్, ఆదిలాబాద్‌లకు పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి కరీంనగర్‌కు వచ్చిన 16 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే 10 మంది శాంపిల్స్‌ను అధికారులు తీసుకున్నారు. మరో ఆరుగురి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. యూకే నుంచి ఆదిలాబాద్ జిల్లాకు 12 మంది వచ్చిన వారి నుంచి శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌కు వైద్యులు పంపారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం