తెలంగాణ: కొత్తగా 648 మందికి పాజిటివ్.. 6,39,369కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Jul 22, 2021, 09:27 PM ISTUpdated : Jul 22, 2021, 09:38 PM IST
తెలంగాణ: కొత్తగా 648 మందికి పాజిటివ్.. 6,39,369కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 696 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,857 యాక్టివ్‌ కేసులు వున్నాయి.   

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,14,928 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 648 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,774కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 696 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 9,857 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 82 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,39,369 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,25,738 మంది కోలుకున్నారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 26, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 20, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 8, గద్వాల 7, కామారెడ్డి 1, కరీంనగర్ 59, ఖమ్మం 46, మహబూబ్‌నగర్ 10, ఆసిఫాబాద్ 6, మహబూబాబాద్ 12, మంచిర్యాల 28, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 35, ములుగు 8, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 35, నారాయణపేట 7, నిర్మల్ 0, నిజామాబాద్ 10, పెద్దపల్లి 28, సిరిసిల్ల 18, రంగారెడ్డి 25, సిద్దిపేట 13, సంగారెడ్డి 11, సూర్యాపేట 44, వికారాబాద్ 4, వనపర్తి 14, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 52, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu