తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా తీవ్రత: కొత్తగా 605 మందికి పాజిటివ్.. మూడు జిల్లాల్లో ‘‘ సున్నా ’’ కేసులు

Siva Kodati |  
Published : Jul 04, 2021, 08:59 PM IST
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా తీవ్రత: కొత్తగా 605 మందికి పాజిటివ్.. మూడు జిల్లాల్లో ‘‘ సున్నా ’’ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు మరోసారి భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 605 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 107 కొత్త కేసులు నమోదయ్యాయి

తెలంగాణలో కరోనా కేసులు మరోసారి భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 605 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 107 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అదే సమయంలో వైరస్ నుంచి 1,088 మంది కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,26,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,11,035 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 11,964 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,691కి చేరింది

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 25, జీహెచ్ఎంసీ 107, జగిత్యాల 19, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 14, గద్వాల 5, కామారెడ్డి 1, కరీంనగర్ 54, ఖమ్మం 22, ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 10, మహబూబాబాద్ 33, మంచిర్యాల 19, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 27, ములుగు 9, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 27, నారాయణపేట 3, నిర్మల్ 0, నిజామాబాద్ 6, పెద్దపల్లి 21, సిరిసిల్ల 24, రంగారెడ్డి 33, సిద్దిపేట 22, సంగారెడ్డి 7, సూర్యాపేట 36, వికారాబాద్ 5, వనపర్తి 1, వరంగల్ రూరల్ 19, వరంగల్ అర్బన్ 26, యాదాద్రి భువనగిరిలో 8 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 


 

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు