బంజారాహిల్స్‌లో గోనెసంచి కలకలం: తెరిచి చూస్తే ...

Siva Kodati |  
Published : Aug 30, 2020, 05:20 PM ISTUpdated : Aug 30, 2020, 05:21 PM IST
బంజారాహిల్స్‌లో గోనెసంచి కలకలం: తెరిచి చూస్తే ...

సారాంశం

హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 2లో గోనె సంచిలో శవం కలకలం రేపింది

హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 2లో గోనె సంచిలో శవం కలకలం రేపింది. ఫుట్‌పాత్‌పై అనుమానాస్పదంగా కనిపించిన గోనెసంచిలో మృతదేహం వున్నట్లుగా అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కోవిడ్ కారణంగా అన్ని జాగ్రత్తలు  తీసుకుని గోనెసంచిని తెరిచారు. సదరు సంచిలో 60 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం వుంది.

శరీరంపై ఏమైనా గాయాలున్నా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం ద్వారా మృతదేహాన్ని ఎవరు తెచ్చి పడేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

కాగా మహిళ ఎవరనేది తెలియాల్సి వుందని, పోస్ట్‌మార్టం ద్వారా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది. అయితే ఆమెను హత్య చేసి ఇక్కడ పడేశారా..? మరేదైనా కారణముందా..? అనేది తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు