అత్యాచారం కేసులో 58 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష...

By SumaBala Bukka  |  First Published Jul 15, 2023, 11:57 AM IST

టీనేజర్ పై అత్యాచారం కేసులో ఓ 58యేళ్ల వ్యక్తికి హైదరాబాద్ లోని సెషన్స్ కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష విధించింది. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో ఓ అత్యాచార నిందితుడికి 20యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. నగరంలోని భవానీనగర్‌లో తన బంధువుపై 58 ఏళ్ల వ్యక్తిపలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తికి పోక్సో కేసుల 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ స్పెషల్ కోర్టు జడ్జి టి.అనిత శుక్రవారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

దీనితో పాటు 5,000 జరిమానా చెల్లించాలని, బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆర్థికంగా చితికిపోయిన బాధితురాలి తల్లిదండ్రులు దోషి పనిచేసిన పాఠశాలలో ఆ అమ్మాయిని చేర్పించారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Latest Videos

జగన్ అక్రమాస్తుల కేసు : వైఎస్ భారతీరెడ్డిపై ఈడీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం..

బాధితురాలు కొద్దికాలం దాడిని భరించింది. అదింకా ఆగేలాగా లేకపోవడంతో.. ఆమె ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇది సహాయపడిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు.

click me!