కొత్తగా 577 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,48,388కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 06, 2021, 10:11 PM ISTUpdated : Aug 06, 2021, 10:22 PM IST
కొత్తగా 577 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,48,388కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 577 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్ధరు మృతి చెందారు.  645 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,674 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,226 నమూనాలను పరీక్షించగా.. 577 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,48,388కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారికి ఇద్దరు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 3,819కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 8,674 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. అదే సమయంలో 645 మంది కరోనా నుంచి కోలుకోగా.. వీటితో కలిపి తెలంగాణలో మెత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 6,35,895కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.07 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో  79 కేసులు నమోదైనట్లు తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 20, జీహెచ్ఎంసీ 79, జగిత్యాల 19, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 66, ఖమ్మం 42, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 12, మంచిర్యాల 15, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 30, ములుగు 8, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 36, నారాయణపేట 2, నిర్మల్ 1, నిజామాబాద్ 7, పెద్దపల్లి 34, సిరిసిల్ల 14, రంగారెడ్డి 25, సిద్దిపేట 19, సంగారెడ్డి 7, సూర్యాపేట 21, వికారాబాద్ 4, వనపర్తి 2, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 38, యాదాద్రి భువనగిరిలో 17 చొప్పున కేసులు నమోదయ్యాయి.  


 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే