ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం... స్కూల్ వద్ద బంధువుల ఆందోళన (వీడియో)

Published : Sep 15, 2018, 11:28 AM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం... స్కూల్ వద్ద బంధువుల ఆందోళన (వీడియో)

సారాంశం

హైదరాబాద్ లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఓ ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనతో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నగరంలోని గోల్కొండ ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

వివరాల్లోకి వెళితే...గోల్కొండ ప్రాంతంలో నివాసముండే ఓ మూడేళ్ల చిన్నారి స్థానిక అజాన్ ఇంటర్నేషనల్ స్కూళ్లో చదువుకుంటోంది. అయితే అదే పాఠశాలలో పనిచేసే ఉద్యోగి జిలానీ పాపపై కన్నేశాడు. పాపపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తమ కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే బాలికను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు .

ఈ దారుణం గురించి తెలుసుకున్న స్థానికులు, బాలిక బంధువులు అజాన్ స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. స్కూల్లోకి వెళ్లి ఫర్నీచర్ ద్వంసం చేశారు. చిన్నారిపై దారుణానికి పాల్పడిన నిందితున్ని ఉరి తీయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.  
 
వీడియో

"

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు