తెలంగాణ: 24 గంటల్లో 482 మందికి పాజిటివ్.. 6,50,835కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 11, 2021, 09:32 PM IST
తెలంగాణ: 24 గంటల్లో 482 మందికి పాజిటివ్.. 6,50,835కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 482 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరోజు వ్యవధిలో 455 మంది కోలుకోగా.. ప్రస్తుతం 8,137 యాక్టీవ్ కేసులున్నాయి.   

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 88,164 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 482 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,50,835కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో మృతి చెందిన వారి సంఖ్య 3,833కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 455 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి  వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,38,865కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 8,137 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 19, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 5, గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 61, ఖమ్మం 26, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 7, మంచిర్యాల 13, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 6, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 35, నారాయణపేట 3, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 25, సిరిసిల్ల 13, రంగారెడ్డి 25, సిద్దిపేట 11, సంగారెడ్డి 6, సూర్యాపేట 17, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana