500 దిగువకు రోజువారీ కేసులు.. తెలంగాణలో 6,49,406కి చేరిన మొత్తం సంఖ్య

Siva Kodati |  
Published : Aug 08, 2021, 09:37 PM ISTUpdated : Aug 08, 2021, 09:39 PM IST
500 దిగువకు రోజువారీ కేసులు.. తెలంగాణలో 6,49,406కి చేరిన మొత్తం సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 449 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 623 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,406 యాక్టివ్‌ కేసులు వున్నాయి.  

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో 79,231 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 449 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,49,406కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కోవిడ్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మహమ్మారి వల్ల మరణించి వారి సంఖ్య 3,825 చేరింది. కరోనా బారి నుంచి నిన్న 623 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 8,406 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 73 కేసులు నమోదయ్యాయి. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 13, జీహెచ్ఎంసీ 73, జగిత్యాల 12, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 2, కామారెడ్డి 0, కరీంనగర్ 52, ఖమ్మం 31, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 15, మంచిర్యాల 11, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 30, ములుగు 4, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 12, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 1, పెద్దపల్లి 24, సిరిసిల్ల 09, రంగారెడ్డి 35, సిద్దిపేట 12, సంగారెడ్డి 6, సూర్యాపేట 14, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 19, వరంగల్ అర్బన్ 45, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!