హైదరాబాద్‌లో మరో విషాదం.. నాలాలో పడిన బాలుడి మృతదేహం లభ్యం

Siva Kodati |  
Published : Sep 05, 2023, 06:21 PM IST
హైదరాబాద్‌లో మరో విషాదం.. నాలాలో పడిన బాలుడి మృతదేహం లభ్యం

సారాంశం

హైదరాబాద్ ప్రగతి నగర్‌ ఎన్ఆర్ఐ కాలనీలో ఉదయం ఆడుకుంటూ నాలాలో పడి గల్లంతైన నాలుగేళ్ల బాలుడు మిథున్ మృతదేహం లభ్యమైంది. ఆరు గంటల పాటు తుర్క చెరువులో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు

హైదరాబాద్ ప్రగతి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎన్ఆర్ఐ కాలనీలో ఉదయం ఆడుకుంటూ నాలాలో పడి గల్లంతైన నాలుగేళ్ల బాలుడు మిథున్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఆరు గంటల పాటు తుర్క చెరువులో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉదయం ఆడుతూ పాడుతూ కనిపించిన తమ చిన్నారి విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?