ఒడిషా మహిళపై హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్, నిందితులది అదే రాష్ట్రం

Siva Kodati |  
Published : Aug 18, 2019, 02:51 PM ISTUpdated : Aug 18, 2019, 02:52 PM IST
ఒడిషా మహిళపై హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్, నిందితులది అదే రాష్ట్రం

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వివాహిత తన భర్త, కుమారుడితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వివాహిత తన భర్త, కుమారుడితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

మహేశ్వరం ప్రాంతంలోని ఇటుకల బట్టీలో దంపతులిద్దరు పనికి చేరారు. అయితే ఒడిషాకే చెందిన నలుగురు యువకులు కూడా అక్కడే పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వివాహితపై కన్నేసిన కామాంధులు శుక్రవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

భర్త సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిని రాహూల్ మాజీ, మనోజ్ సమారత్, దుర్గా సమారత్, దయా మాజీగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!