హరికృష్ణ వర్థంతి: జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను పరామర్శించిన బాబు

Siva Kodati |  
Published : Aug 18, 2019, 01:53 PM ISTUpdated : Aug 18, 2019, 01:54 PM IST
హరికృష్ణ వర్థంతి: జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను పరామర్శించిన బాబు

సారాంశం

ఎన్టీఆర్ కుమారుడు, మాజీ మంత్రి దివంగత నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. తిథి ప్రకారం ఆదివారం హరికృష్ణ వర్థంతిని నిర్వహించాలని కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. 

దీనిలో భాగంగా ఉదయం హరికృష్ణ నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను పరామర్శించారు. అనంతరం హరికృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు.

గతేడాది ఆగస్టు 29న నెల్లూరులో ఓ వివాహా కార్యక్రమానికి వెళుతుండగా నల్గొండ జిల్లా అన్నెపర్తి స్టేజీ వద్ద అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై హరిృష్ణ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

స్వయంగా కారు నడుపుతున్న ఆయన సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో కల్వర్టులో పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయనను స్థానికులు నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా