పండగపూట విషాదం.. నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published : Apr 02, 2022, 09:14 AM IST
పండగపూట విషాదం.. నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

సారాంశం

ఉగాది పండగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఉగాది పండగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. జిల్లాలోని చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో  కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి  చెందారు. ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన  వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. 

మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను సూర్యాపేట జిల్లా నేరేడుచర్లవాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్