సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమన్నారు: కేసీఆర్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 21, 2021, 7:40 PM IST
Highlights

అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కిషన్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.  ఓటేసి  గెలిపిస్తే ప్రజలను అవమానపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలనను పక్కనబెట్టి ఫామ్‌హౌస్‌లో వుంటారంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో సీఎం పదవి తనకు ఎడమకాలి చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నారంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓటేసి  గెలిపిస్తే ప్రజలను అవమానపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలనను పక్కనబెట్టి ఫామ్‌హౌస్‌లో వుంటారంటూ ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్ కూలగొట్టి రాష్ట్రంలో పాలన లేకుండా చేశారని... తండ్రి, కూతురు, కొడుకు, అల్లుడు చేతుల్లో తెలంగాణ బందీ అయ్యిందంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ బంధ విముక్తి కోరుకుంటోందని ఆయన అన్నారు. 

అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కిషన్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజున ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలేనని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అయినందుకు తనకు సంతోషంగా లేదని.. అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధ ఉంది అని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్‌పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తానన్నారు.  ఈ ప్రాంతమే తనకు జీవం పోసిందని.. పార్టీ, అంబర్‌పేట తనకు రెండు కళ్లతో సమానం అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

click me!