
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 97,236 శాంపిల్స్ పరీక్షించగా.. వీరిలో 3527 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ కొత్తగా 19మంది ప్రాణాలు కోల్పోగా.. 3982మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 519 కొత్త కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం 215 కేసులు చొప్పున నమోదయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 1.49 కోట్లకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 5,71,044మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 5,30,025మంది కోలుకోగా.. 3226 మందిప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 92.81శాతం కాగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.
Also Read:నోటీసులు బేఖాతరు: విరించి ఆసుపత్రిపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర.. ఆంక్షలు విధింపు
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 154, జగిత్యాల 55, జనగామ 31, జయశంకర్ భూపాలపల్లి 48, జోగులాంబ గద్వాల 54, కామారెడ్డి 20, కరీంనగర్ 178, ఖమ్మం 215, కొమరంభీం ఆసిఫాబాద్ 23, మహబూబ్‌నగర్ 124, మహబూబాబాద్ 119, మంచిర్యాల 88, మెదక్ 40, మేడ్చల్ మల్కాజిగిరి 188, ములుగు 46, నాగర్ కర్నూల్ 81, నల్లగొండ 218, నారాయణ పేట 26, నిర్మల్ 15, నిజామాబాద్ 47, పెద్దపల్లి 144, రాజన్న సిరిసిల్ల 78, రంగారెడ్డి 207, సంగారెడ్డి 75, సిద్దిపేట 115, సూర్యాపేట 152, వికారాబాద్ 83, వనపర్తి 95, వరంగల్ రూరల్ 96, వరంగల్ అర్బన్ 130, యాదాద్రి భువనగిరిలలో 45 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.