తెలంగాణకు ఊరట.. స్వల్పంగా తగ్గిన కేసులు, జీహెచ్ఎంసీలో తీవ్రత

By Siva Kodati  |  First Published May 16, 2021, 8:13 PM IST

తెలంగాణలో కరోనా స్వల్ప ఊరటను ఇచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న 20 గంటల లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆదివారం కొత్తగా 3,816 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది


తెలంగాణలో కరోనా స్వల్ప ఊరటను ఇచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న 20 గంటల లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆదివారం కొత్తగా 3,816 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. కోవిడ్‌తో చికిత్స పొందుతూ  27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,955కి చేరుకుంది.

Latest Videos

undefined

Also Read:తెలంగాణకు అలర్ట్: చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్.. ఖమ్మంలో మరో కొత్త కేసు

రాష్ట్రంలో ఆదివారం 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 24 గంటల్లో కొత్తగా కరోనా నుంచి 5,892 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 4,74,899కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50,969 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 152, జగిత్యాల 135, జనగామ 54, జయశంకర్ భూపాల్‌పల్లి 76, జోగులాంబ గద్వాల్ 86, కామారెడ్డి 25, కరీంనగర్ 152, ఖమ్మం 151, కొమరంభీం ఆసిఫాబాద్ 17, మహబూబ్‌నగర్ 142, మహబూబాబాద్ 90, మంచిర్యాల 89, మెదక్ 44, మేడ్చల్ మల్కాజ్‌గిరి 293, ములుగు 26, నాగర్‌కర్నూల్ 131, నల్గొండ 51, నారాయణ్ పేట్ 31, నిర్మల్ 14, నిజామాబాద్ 66, పెద్దపల్లి 88, రాజన్న సిరిసిల్ల 87,  రంగారెడ్డి 326, సంగారెడ్డి 143, సిద్దిపేట 138, సూర్యాపేట 52, వికారాబాద్ 135, వనపర్తి 129, వరంగల్ రూరల్ 56, వరంగల్ అర్బన్ 124, యాదాద్రి భువనగిరిలో 37 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

click me!