ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు .. 31 మంది అరెస్ట్ , పరారీలో ఆరుగురు : రాచకొండ సీపీ

By Siva KodatiFirst Published Dec 10, 2022, 2:39 PM IST
Highlights

ఆదిభట్లలో డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన కేసులో మొత్తం 31 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. వీరిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, పరారీలో మరో ఆరుగురు వున్నారని చెప్పారు. 
 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల కిడ్నాప్ కేసుకు సంబంధించి 31 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. పరారీలో మరో ఆరుగురు వున్నారని ఆయన వెల్లడించారు. పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. నగరం భాను ప్రకాశ్, రాథోడ్ సాయినాథ్, కార్తీక్, గన్నోజి ప్రసాద్, మహ్మద్ ఇర్ఫాన్, నీలేష్ కుమార్ సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మహేశ్ భగవత్ తెలిపారు.

కాగా... కిడ్నాప్ ఘటనకు సంబంధించి నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతి ఇంటికి వెళ్లి తన కొడుకు చేసింది తప్పేనని చెప్పిన నారాయణమ్మ.. అంతకుముందు జరిగిన విషయాలను కూడా చూడాలని కోరారు. వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపారు. యవతితో పెళ్లి అయిందని తన కొడుకు చెప్పాడని.. అయితే పెళ్లి జరిగిందో, లేదో తనకు తెలియదని చెప్పారు. యువతి తల్లిదండ్రులు తొలుత నవీన్ తో పెళ్లి చేస్తామని చెప్పారని, ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. తన కొడుకుని పైసల కోసం యువతి కుటుంబం వాడుకుందని ఆరోపించారు. నవీన్ రెడ్డికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయని చెప్పారు. అయితే వారిద్దరికి పెళ్లి అయిందనే తన బంధువులు కూడా భావించేవారని చెప్పారు. 

తన కొడుకు ఎప్పుడూ ఫోన్ చేసి బయట ఉన్నానని  చెప్పేవాడని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఆమెను కాలేజ్‌కు తీసుకెళ్లేవాడని  చెప్పారు. ఆ యువతి  కూడా నవీన్ రెడ్డిని ప్రేమించిందని.. తమ ఇంటికి కూడా వచ్చిందని చెప్పారు. యువతి ఇప్పుడు ఎందుకిలా మారిపోయిందో తెలియదని తెలిపారు. అయితే ఆమె మనస్ఫూర్తిగా కోడలిగా వస్తే అంగీకరిస్తానని చెప్పారు.

ALso REad:పెళ్లి చేసుకున్నామని నా కొడుకు చెప్పాడు.. నిన్న చేసింది తప్పే కానీ.. : నవీన్ రెడ్డి తల్లి సంచలన కామెంట్స్

ఇదిలా ఉంటే.. తన కూతురుతో పెళ్లి అయిందని నవీన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని యువతి దామోదర్ రెడ్డి. తన కూతురితో కలిసి దిగిన ఫొటోలను నవీన్ రెడ్డి  పెళ్లి జరిగిందనే ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. తన సొంత గ్రామంలో కూడా తనను బద్నామ్ చేసే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తన కూతురును సొంతం చేసుకోవాలనే  నవీన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఉదయం తన కూతురు నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు నవీన్ రెడ్డి తన కూతురును అపహరించి ఉదయం 11:30 గంటలకు కారులో తీసుకెళ్లారని చెప్పారు. 

అడ్డుకోవడానికి యత్నించిన తనపై ఇనుప రాడ్‌తో తలపై కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయానని తెలిపారు. తాను తేరుకునే సమయానికి తన కూతురు కనిపించలేదని అన్నారు. పలువురు కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డితో వచ్చినవారు దాడి  చేశారని ఆరోపించారు. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన కూడా స్పందించలేదని చెప్పారు. ఇక, ఈ వ్యవహారంలో ఇరు కుటుంబాలకు సంబంధించిన  వాదనలు భిన్నంగా పోలీసులు అసలు వాస్తవాలు ఏమిటనేది వెలికి తీసే పనిలో పడ్డారు. 

click me!