చేపలు పట్టడానికి వెళ్లి మూసీలో కొట్టుకుపోయిన యువకులు: కాపాడిన రెస్క్యూ టీమ్

By Siva KodatiFirst Published Aug 16, 2020, 8:49 PM IST
Highlights

చేపలు పట్టాలన్న సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. మృత్యు ముఖంలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు వచ్చి రక్షించడంతో బాధితుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. 

చేపలు పట్టాలన్న సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. మృత్యు ముఖంలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు వచ్చి రక్షించడంతో బాధితుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా రాయనిగూడెం సమీపంలో మూసీ నదిలో చేపలు పట్టేందుకు చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు చేపలు పట్టేందుకు వెళ్లారు.

Also Read:దుందుభి వాగులో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సు: ప్రయాణీకులు సురక్షితం

చేపలు పడుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో నీళ్లలో కొట్టుకుపోయి అన్నారం సమీపంలో తేలారు. ఉద్దృతంగా ప్రవహిస్తున్న నీటి మధ్యలోనే చాలా సేపు ఉండిపోయారు.

యువకులు మూసీలో చిక్కుకుపోయారని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా ఎస్పీ భాస్కరన్ సహా సహాయక బృందాలు అక్కడికి చేరుకుని నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. 

click me!