బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయిన కుటుంబం, చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి

Siva Kodati |  
Published : Apr 21, 2022, 08:17 PM IST
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయిన కుటుంబం, చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి

సారాంశం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని గుడిబండ ఫ్లైఓవర్‌పై అతివేగంతో బైకును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా వుంది. 

సూర్యాపేట జిల్లా (suryapet district) కోదాడలో (kodad) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. గుడిబండ ఫ్లైఓవర్‌పై అతివేగంతో బైకును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు ఫ్లైఓవర్ పై నుంచి కిందపడిపోయారు. చిన్నారి సహా దంపతులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చిన్నారుల పరిస్ధితి విషమంగా వుంది. ముగ్గురు చిన్నారులతో దంపతులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్