తెలంగాణలో (corona cases in telangana) గడిచిన 24 గంటల్లో 94,020 మంది నమూనాలను పరీక్షించగా.. 2,850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,66,761కి పెరిగింది.
తెలంగాణలో (corona cases in telangana) గడిచిన 24 గంటల్లో 94,020 మంది నమూనాలను పరీక్షించగా.. 2,850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,66,761కి పెరిగింది. తాజాగా కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35,625 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. తాజా రికవరీలతో కలిపి తెలంగాణలో 7,27,045 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనాతో రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 4,091కి పెరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 859 కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 45, భద్రాద్రి కొత్తగూడెం 93, జీహెచ్ఎంసీ 859, జగిత్యాల 61, జనగామ 34, జయశంకర్ భూపాలపల్లి 25, గద్వాల 18, కామారెడ్డి 38, కరీంనగర్ 99, ఖమ్మం 92, మహబూబ్‌నగర్ 68, ఆసిఫాబాద్ 24, మహబూబాబాద్ 51, మంచిర్యాల 71, మెదక్ 40, మేడ్చల్ మల్కాజిగిరి 173, ములుగు 17, నాగర్ కర్నూల్ 43, నల్గగొండ 98, నారాయణపేట 18, నిర్మల్ 40, నిజామాబాద్ 62, పెద్దపల్లి 60, సిరిసిల్ల 47, రంగారెడ్డి 157, సిద్దిపేట 101, సంగారెడ్డి 81, సూర్యాపేట 88, వికారాబాద్ 43, వనపర్తి 38, వరంగల్ రూరల్ 31, హనుమకొండ 82, యాదాద్రి భువనగిరిలో 53 చొప్పున కేసులు నమోదయ్యాయి.
undefined
మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,67,059 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. 20 శాతం కొత్త కేసుల్లో తగ్గుదల చోటుచేసుకుంది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,14,69,499 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా వైరస్ బారినుంచి 2,54,076 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,92,30,198కి చేరింది. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాలు మాత్రం క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా కరోనా వైరస్ తో పోరాడుతూ 1,192 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజుల తర్వాత రోజువారి కోవిడ్ మరణాలు వేయి మార్కును దాటాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,96,242కు పెరిగింది. కొత్తగా నమోదైన కోవిడ్ మరణాల్లో అత్యధికం 638 దక్షిణాది రాష్ట్రమైన కేరళలో వెలుగుచూశాయి. దేశంలో కోవిడ్ పాజిటివిటీ రేటు సైతం తగ్గుముఖం పడుతున్నది. పాజిటఙవిటీ రేటు 15.7 శాతం నుంచి 11.6 శాతానికి పడిపోయింది. అయితే వారాంతపు పాజిటివిటీ రేటు మాత్రం 15.25 శాతంగా ఉంది. COVID-19 రికవరీ రేటు ప్రస్తుతం 94.6 శాతంగా ఉండగా, మరణాలు రేటు 1.20 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలను కొనసాగిస్తున్నాయి. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కరోనా పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఇప్పటివకు మొత్తం 166.68 కోట్ల కరోనా వైరస్ టీకా డోస్‌లను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 89.4 కోట్ల మంది ఉన్నారు. రెండు డోసులు తీసుకున్న వారు 70.8 కోట్ల మంది ఉన్నారు. మొత్తంగా దేశ వయోజన జనాభాలో 75 శాతం మంది పూర్తిగా వ్యాక్సినేషన్‌ను అందించారు. కరోనా పరీక్షలు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 72,89,97,813 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆ) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 13,31,19 కోవిడ్-19 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.01.02.2022 at 5.30pm) pic.twitter.com/ZCyvX8UPLN