మేడ్చల్ : టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కోవిడ్ కలకలం.. 25 మంది విద్యార్ధులకు పాజిటివ్

By Siva KodatiFirst Published Nov 26, 2021, 8:22 PM IST
Highlights

టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. 25 మంది విద్యార్ధులకు, ఐదుగురు టీచర్లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం వర్సిటీకి సెలవు ప్రకటించింది. 

టెక్ మహీంద్రా యూనివర్సిటీలో (tech mahindra university) కరోనా (coronavirus) కలకలం రేగింది. 25 మంది విద్యార్ధులకు, ఐదుగురు టీచర్లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం వర్సిటీకి సెలవు ప్రకటించింది. 

కాగా.. కర్ణాటకలోని Dharwad Medical Collegeలో జరిగిన కళాశాల ఈవెంట్.. కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారింది. ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య.. తాజాగా 182కి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలేజీలోని మొత్తం సిబ్బంది, విద్యార్థులకు Corona examinationలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, వైరస్ బారిన పడినవారిలో చాలామంది టీకా రెండు డోసులు తీసుకున్నవారే కావడంతో వారందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని తెలిపారు. 

ALso Read:సూపర్ స్ప్రెడర్ గా కర్ణాటక మెడికల్ కాలేజ్ పార్టీ... 182 చేరిన కరోనా కేసులు...

ధార్వాడ్ లోని ఎస్ డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, Positive గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, వీరిలో 66 మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.

మరో 100 మందికి పైగా విద్యార్థులకు టెస్టు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. దీంతో ఇప్పటివరకు కాలేజీలో 182 మంది కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 17న కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. ఈ వేడుకలతోనే virus spread జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో చాలామంది ఇప్పటికే Two doses of vaccine తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్ హాస్టళ్లలోనే Quarantineలో ఉన్నారు.

click me!