బెయిల్‌‌పై వచ్చి అజ్ఞాతంలోకి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసుల గాలింపు

By Siva KodatiFirst Published Nov 26, 2021, 8:03 PM IST
Highlights

చీటింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన అనంతరం కనిపించకుండా పోయారు. 

చీటింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన అనంతరం కనిపించకుండా పోయారు. నార్సింగి, రాయదుర్గం పీఎస్‌లో వున్న కేసులకు సంబంధించి శ్రీధర్ రావు విచారణకు హాజరుకావడం లేదు. దీంతో గత నాలుగు రోజులుగా శ్రీధర్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన జాడ తెలియకపోవడంతో ఇంటికి నోటీసులు అతికించారు. 

కాగా, నవంబర్ 18న sandhya convention ఎండీ sridhar raoను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో కమర్షియల్ కాంప్లెక్స్‌ వ్యవహారంలో శ్రీధర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన శ్రీధర్‌ రావు కోట్ల రూపాయాలు కొట్టేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై పులవురు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిన్న బెంగళూరులో శ్రీధర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు శ్రీదర్‌రావును చర్లపల్లి జైలుకు తరలించారు. 

ఇక, హైదరాబాద్‌తో పాటు ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్స్‌ని కూడా శ్రీధర్ రావు మోసం చేసినట్లు సమాచారం. దీంతో వారు డబ్బుల కోసం శ్రీధర్ రావు చుట్టూ తిరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ శారీసెంటర్ యజమానురాలిని కూడా శ్రీధర్ రావు మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీధర్‌రావు రూ. 11 కోట్లు తీసుకుని శ్రీధర్ రావు ప్లాట్ అప్పగించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. 

అంతేకాకుండా శ్రీధర్ రావు మీద అసహజ లైంగిక దాడి కేసు నమోదయ్యింది. శ్రీధర్ రావు తనపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సనత్ నగర్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సనత్ నగర్ కు చెందిన సీహెచ్ చౌదరి (పూర్తి పేరు రాయడం లేదు). స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

ALso Read:సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై అసహజ లైంగికదాడి ఆరోపణలు.. బాడీగార్డును కత్తితో బెదిరించి...

నందగిరి హిల్స్ లో ఉంటున్న Sridhar Rao దగ్గర చౌదరి జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు, bodyguardగా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 10వ తేదీ రాత్రి ఇద్దరూ బయటకు వెళ్లి 1.30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. కాసేపటి తరువాత సెకండ్ ఫ్లోర్ లోని తన బెడ్ రూమ్ కు రమ్మని చౌదరికి చెప్పిన శ్రీధర్ రావు.. వెన్ను నొప్పిగా ఉందంటూ... Massage చేయమని అడిగాడు. దీంతో చౌదరి కొంతసేపు మసాజ్ చేశాడు. ఆ సమయంలో శ్రీధర్ రావు కొన్ని పిల్స్ వేసుకోవడం గమనించాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే చౌదరిని శ్రీధర్ రావు బలవంతంగా దగ్గరు లాక్కోవడం ప్రారంభించాడు. చౌదరి నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో knifeతో బెదిరించాడు. చౌదరి నిరాకరించడంతో కత్తితో చొక్కా సహా బట్టలన్నీ చింపేశాడు.

తాను వద్దంటూ వారిస్తున్నా, ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా శ్రీధర్ రావు తన మీద Sexual assaultకి పాల్పడ్డాడని చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. రెండు గంటల పాటు నరకం అనుభవించానని, విపరీతమైన రక్తస్రావం జరిగిందని తెలిపాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని శ్రీధర్ రావు బెదిరించినట్లు పేర్కొన్నాడు. తాను ఇన్నాళ్లూ భయపడ్డానని, ఇప్పుడతని మోసాలు బయటకు రావడంతో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చౌదరి పోలీసులకు తెలిపాడు. 

click me!