కరోనా కలకలం:భైంసా స్కూల్లో 25 మంది విద్యార్ధులకు కోవిడ్

By narsimha lode  |  First Published Mar 18, 2021, 5:52 PM IST

నిర్మల్ జిల్లాలోని భైంసా  స్కూల్లో కరోనా కలకలం రేపింది.మహాత్మాజ్యోతిబాపూలే బాలుర స్కూల్లో గురువారం నాడు 176 మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే 25 మందికి కరోనా సోకింది.



నిర్మల్: నిర్మల్ జిల్లాలోని భైంసా  స్కూల్లో కరోనా కలకలం రేపింది.మహాత్మాజ్యోతిబాపూలే బాలుర స్కూల్లో గురువారం నాడు 176 మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే 25 మందికి కరోనా సోకింది.

ఈ పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్ధులకు కరోనా సోకినట్టుగా బుధవారం నాడు తేలింది. దీంతో గురువారం నాడు కూడ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈ స్కూల్లో 34 మంది విద్యార్ధులకు కరోనా సోకినట్టైంది.

Latest Videos

undefined

ఒకే స్కూల్‌లో 34 మంది విద్యార్ధులు కరోనా బారినపడడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్కూల్‌కి చెందిన మిగిలిన విద్యార్ధులను కూడ పరీక్షించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ స్కూల్లోని 140 మంది విద్యార్ధులకు కూడ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇదే మండలంలోని పోలీసులకు కూడ పరీక్షలు నిర్వహిస్తే ఒక్కరికి కరోనా సోకినట్టు తేలింది. విధుల్లో ఉన్న 29 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఒక్కరికి కరోనా సోకినట్టుగా తేలింది.

click me!