కరోనా తర్వాత సరైన మావోలకు చికిత్స లేదు: డీజీపీ ఎదుట శారదక్క లొంగుబాటు

By narsimha lodeFirst Published Sep 17, 2021, 2:08 PM IST
Highlights

మావోయిస్టులకు సరైన చికిత్స అందక బయటకు రావాలని చూస్తున్నారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత శారదక్క లొంగిపోయారు. 


హైదరాబాద్:కరోనా తర్వాత మావోయిస్టులకు సరైన చికిత్స అందడం లేదని ఆయన చెప్పారు. ఆరోగ్య కారణాలతో చాలామంది పార్టీని వదిలి బయటకు వస్తున్నారని తెలంగాణ  డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

also read:షాక్: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారదక్క లొంగుబాటు

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత శారదక్క లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.శారదక్క ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. 1997-98 మధ్యలో శారద కిన్నెర దళంలో పనిచేసిందన్నారు. 

1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ సభ్యురాలిగా పనిచేసిందని డీజీపీ చెప్పారు.2008లో వరంగల్ ఎస్పీ ముందు శారదక్క లొంగిపోయిందని డీజీపీ గుర్తు చేశారు. అయితే 2011లో ఆమె తిరిగి పార్టీలో చేరిందని డీజీపీ తెలిపారు.2016లో చర్ల ఏరియా కమిటీకి ఆమె ప్రమోట్ అయిందని డీజీపీ చెప్పారు. శారదపై 25 కేసులున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు.ఆరు దఫాలు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆమె తప్పించుకొందని డీజీపీ చెప్పారు.
 

click me!