జగిత్యాలలో మిస్టరీగా యువతి మృతి కేసు.. చెల్లిపైనే అనుమానాలు, ప్రియుడి కోసం అక్కనే కడతేర్చిందా..?

Siva Kodati |  
Published : Aug 29, 2023, 07:42 PM ISTUpdated : Aug 29, 2023, 07:59 PM IST
జగిత్యాలలో మిస్టరీగా యువతి మృతి కేసు.. చెల్లిపైనే అనుమానాలు, ప్రియుడి కోసం అక్కనే కడతేర్చిందా..?

సారాంశం

జగిత్యాల జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. చెల్లెలే అక్కను చంపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది చెల్లెలు చందన. ఆమె ఓ యువకుడితో కలిసి బస్టాండ్‌లో వున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు.

జగిత్యాల జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. చెల్లెలే అక్కను చంపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ యువకుడితో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోతుండగా.. అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోరుట్ల పట్టణం భీముని దిబ్బలోని 24 ఏళ్ల యువతి దీప్తి మృతి మిస్టరీగా మారింది. గృహ ప్రవేశం వుండటంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంట్లో అక్కాచెల్లెళ్లు చందనా, దీప్తి వున్నారు. అయితే దీప్తి సోఫాలో శవమై కనిపించింది. చెల్లెలు చందన కనిపించలేదు. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది చెల్లెలు చందన. ఆమె ఓ యువకుడితో కలిసి బస్టాండ్‌లో వున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ బస్ ఎక్కి వెళ్లినట్లు చెబుతున్నారు. రాత్రి అక్కా చెల్లెళ్ల మధ్య జరిగిన గొడవలో అక్క మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం