హైదరాబాద్‌లోని రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం పాటు 22 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..

Published : Jun 25, 2023, 12:34 PM IST
హైదరాబాద్‌లోని రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం పాటు 22 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..

సారాంశం

మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తిరుగ‌వ‌ల‌సిన‌ మొత్తం 22 ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

హైదరాబాద్‌: నగరంలోని రైల్వే  ప్రయాణికులకు అలర్ట్. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల నేపథ్యంలో నగరంలో తిరుగ‌వ‌ల‌సిన‌ మొత్తం 22 ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 26 నుంచి జులై 2 వరకు ఈ సర్వీసులను రద్దు చేసినట్టుగా  పేర్కొంది. వివిధ రకాల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. రైళ్ల రద్దు వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఎంఎంటీఎస్ రైళ్ల‌లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ ర‌వాణాను ఎంచుకోవాల‌ని సూచించింది. 

రద్దైన ఎంఎంటీఎస్ రైళ్లు.. 
1. 47129- లింగంపల్లి-హైదరాబాద్
2. 47132-లింగంపల్లి-హైదరాబాద్
3. 47133- లింగంపల్లి-హైదరాబాద్
4.47135- లింగంపల్లి-హైదరాబాద్
5.47136- లింగంపల్లి-హైదరాబాద్
6.47105- హైదరాబాద్- లింగంపల్లి
7.47108-  హైదరాబాద్- లింగంపల్లి
8.47109-  హైదరాబాద్- లింగంపల్లి
9.47110-  హైదరాబాద్- లింగంపల్లి
10.47112-  హైదరాబాద్- లింగంపల్లి
11.47165- ఉమ్దానగర్- లింగంపల్లి
12.47189- లింగపల్లి-ఫలక్‌నుమా
13. 47178- లింగంపల్లి-ఉమ్దానగర్
14. 47179- లింగపల్లి-ఫలక్‌నుమా
15.47158- ఫలక్‌నుమా- లింగపల్లి
16. 47211- ఉమ్దానగర్- లింగంపల్లి
17. 47212- లింగంపల్లి-ఉమ్దానగర్
18. 47214- ఉమ్దానగర్- లింగంపల్లి
19. 47177- రామచంద్రపురం- ఫలక్‌నుమా
20. 47156- ఫలక్‌నుమా- లింగపల్లి
21. 47157- ఉమ్దానగర్- లింగంపల్లి
22. 47181- లింగంపల్లి-ఉమ్దానగర్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?