ఒక్కరికే 22 కాంట్రాక్టులు...అనుమతులు తుంగలో తొక్కి పనులు.. కాంట్రాక్టర్, ప్రభుత్వ శాఖలకు హైకోర్టు నోటీసులు..

By SumaBala BukkaFirst Published Jun 7, 2023, 7:57 AM IST
Highlights

కొత్తగూడెం జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు ఓ కాంట్రాక్టు సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది. 

హైదరాబాద్ : ఒకే కాంట్రాక్టర్ కు ఒకటి కాదు, రెండు కాదు.. పది కాదు ఏకంగా 22 ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చారు. దీనిమీద హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖల ఒకే కాంట్రాక్టర్ కు 22 కాంట్రాక్టులు అప్పగించింది. ఒకే సంస్థకు.. రెండు ప్రభుత్వ శాఖలు ఇన్ని కాంట్రాక్టులను ఎలా అప్పగించాయని  ప్రశ్నించింది. 

దీని మీద పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కాంట్రాక్టర్ ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ తో పాటు ప్రభుత్వ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మలపల్లి రాంబాబు అనే వ్యక్తి.. ఒకరికి 22 కాంట్రాక్టర్లు అప్పగించడంపై…ఇలా చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం సవాల్ చేస్తూ.. వ్యక్తిగత హోదాలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

కుల‌వృత్తులు, చేతివృత్తుల‌కు రూ.1 ల‌క్ష ఆర్థిక సాయం.. ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం.. అప్లై చేసుకోండిలా..

మంగళవారం దీనిమీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని పిటీషనర్ వాదనలు వినిపిస్తూ తెలిపారు. ఆర్అండ్ బి, పంచాయతీ అప్పగించిన పనులకు ఎలాంటి అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్స్ అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు లేకుండా రోడ్లు, వంతెనలు నిర్మాణాలను చేపడుతోందని ఆరోపించారు.

వీటికి కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఈ పనులతో కాలుష్యం ఏర్పడుతోందని వాదించారు. దీనిమీద ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏం సంజీవ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కాంట్రాక్టులు అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. అయితే, ధర్మాసనం వాదనలు విన్న తర్వాత.. కాంట్రాక్టర్ సహా అధికారులకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 25వ తేదీకి వాయిదా వేసింది. దీనిమీద కాంట్రాక్టర్ కు విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి బిల్లులను చెల్లించవద్దని మభ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. 

click me!