ప్రారంభోత్సవానికి సిద్ధమైన రామానుజాచార్య‌ 216 అడుగుల విగ్రహం.. ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

By team teluguFirst Published Jan 14, 2022, 3:33 PM IST
Highlights

చినజీయర్ స్వామి ఆశ్ర‌మంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య‌ విగ్రహం ప్రారంభోత్స‌వానికి అంతా సిద్ధ‌మైంది. ఈ విగ్ర‌హాన్నిప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫిబ్రవరి 5వ తేదీన ఆవిష్క‌రించ‌నున్నారు. 

చినజీయర్ స్వామి (chinajeeyar swamy) ఆశ్ర‌మంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య‌ (ramanujacharya) విగ్రహం ప్రారంభోత్స‌వానికి అంతా సిద్ధ‌మైంది. ఈ విగ్ర‌హాన్నిప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prim minister naredndra modi) ఆవిష్క‌రించ‌నున్నారు. వ‌చ్చే నెల (ఫిబ్ర‌వ‌రి)2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో రామానుజాచార్య 1000వ జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆశ్ర‌మం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లే దారిలో 30 కి.మీ.దూరంలో ముచ్చింతల గ్రామంలో ఉంది. 

రామానుజాచార్య 1000వ జ‌యంతి ఉత్స‌వాలను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చిన‌జీయర్ స్వామి ఆశ్ర‌మంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దీని ఈ ఆశ్ర‌మంలో 108 దేవాల‌యాలు నిర్మించారు. అలాగే 216 అడుగుల రామానుజాచార్య విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆశ్ర‌మానికి వ‌చ్చి రామానుజాచార్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. 8.9వ తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న సాధుసంతువుల‌తో ‘‘ధర్మ సమ్మేళనం’’ నిర్వహిస్తారు. 

10వ తేదీన సామాజిక సామారస్యత దృష్ట్యా ‘‘సామాజిక నేతల సమ్మేళనం’’ జరనున్నాయి. బంగారంతో రూపొందించిన రామానుజ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ (president ramnadh kovind) 13వ తేదీన ఆవిష్కరించనున్నారు. 9వ తేదీన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గవత్ (rss chief mohan bhagvath), 8,9,10 తేదీలలో భయ్యాజి జోషి, భాగయ్యలు ఈ ఉత్స‌వాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్ర‌తీ రోజు వేద పండితులతో వేదోచ్చారణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. 1035 యజ్ఞ గుండాల‌లో యజ్ఞ, యాగాదులు వంటి అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. ఈ య‌జ్ఞ యాగాదులను భ‌క్తులు సంద‌ర్శించవచ్చు. పాల్గొన‌వ‌చ్చు. 
 

click me!